బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఇంట్లో విషాదం..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు తాతా విశ్వేశ్వరరావు కుమారుడు నిఖిల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో నిఖిల్ వర్క్ చేస్తున్నాడు. తన కారులో ఆఫీస్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. నిఖిల్ మృతదేహాన్ని బెంగళూరు నుంచి స్వగ్రామమైన పిండిప్రోలు గ్రామానికి తరలించారు.

శుక్రవారం తన స్వగ్రామంలో నిఖిల్ అంత్యక్రియలు కుటుంబసభ్యులు నిర్వహించనున్నారు. సోదరుడి కుమారుడు మరణవార్తతో తాతా మధు కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నిఖిల్ వయస్సు 27 సంవత్సరాలు. తాతా మధుసూదన్ ప్రస్తుతం ఎమ్మెల్సీతో పాటు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. సోరుదరుడి కుమారుడు మృతితో విషాదంలో మునిగి ఉన్న తాతా మధుని పలువురు బీఆర్ఎస్ నేతలు పరామర్శిస్తున్నారు.