సోనియా నాయకత్వంలోనే దేశానికి రక్షణ: రేవంత్

దేశానికి మోడీ, తెలంగాణకు కేసీఆర్ ప్రమాదకరం

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ , సీఎం కెసిఆర్ లపై మరోసారి విమర్శలు గుప్పించారు. దేశానికి మోదీ, తెలంగాణకు కేసీఆర్ చాలా ప్రమాదకరమని చెప్పారు. మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని… చిల్లర రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీని కదిలించలేరని అన్నారు. దేశానికి మంచి రోజులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పారు. సోనియాగాంధీ నాయకత్వంలోనే దేశానికి రక్షణ కలుగుతుందని అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలను తరిమికొట్టాల్సిన బాధ్యత గాంధేయవాదులపై ఉందని చెప్పారు. పార్లమెంటులో 80 మందికంటే ఎక్కువ మంది మహిళా ఎంపీలు ఉన్నారని అన్నారని… పెళ్లి ఏ వయసులో చేసుకోవాలనేదానిపై ఆడబిడ్డల అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని.. అంతేకాని హడావుడిగా నిర్ణయం తీసుకోకూడదని చెప్పారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/