కరోనా పరీక్షల కేంద్రాల సంఖ్య పెంచాలి మంత్రికి విజ్ఞప్తి

నియోజకవర్గాల్లో యాంటీజెన్ టెస్టింగ్ సౌకర్యం కోరిన అక్బరుద్దీన్

mim-mla-met-health-minister-etela-rajender

హైదరాబాద్‌: తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను ఎంఐఎం శాసనసభ్యులు ఈరోజు కలిశారు. తమ నియోజకవర్గాల్లో ఉచిత కరోనా టెస్టుల కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరారు. రోజుకు 1000 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే కేంద్రాల సంఖ్యను పెంచాలన్న తమ పాత డిమాండ్ ను కూడా మరోసారి మంత్రికి నివేదించారు. ఎక్కడెక్కడ ఉచిత కరోనా కేంద్రాలు ఉన్నాయో ఆ వివరాలు తెలపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ లో వివరాలు తెలిపారు. కుమ్మర్ వాడి, తాళ్లకుంట, మిల్లత్ నగర్ బస్తీ దవాఖానాల్లో ఉచిత యాంటీజెన్ టెస్టింగ్ సౌకర్యం కల్పించాలని ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యమంత్రిని కోరారని వివరించారు. మలక్ పేట్, నాంపల్లి, కార్వాన్, యాకుత్ పురా, చార్మినార్, బహదూర్ పురా నియోజకవర్గాల్లోనూ కరోనా సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలంటూ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంత్రికి విజ్ఞప్తులు చేశారని అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/