టిక్‌టాక్‌ను నిషేధించండి..ట్రంప్‌కు లేఖ

టిక్‌టాక్‌ సహా చైనా యాప్‌లను నిషేధించాలని చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధులు లేఖ

US congress members urges trump to ban tiktok

అమెరికా: భార‌త ప్ర‌భుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా భార‌త్ త‌ర‌హాలోనే టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయాల‌ని అమెరికా చ‌ట్ట‌స‌భ‌ల‌కు చెందిన 25 మంది ప్ర‌తినిధులు దేశాధ్య‌క్షుడు ట్రంప్‌ను అభ్య‌ర్థించారు. అమెరికా ప్ర‌జ‌ల డేటా, ప్రైవ‌సీ, భ‌ద్ర‌త అంశంలో ఈ నిర్ణ‌యం తీసుకోవాల‌ని 25 మంది ప్ర‌తినిధులు తెలిపారు. జాతీయ భ‌ద్ర‌త‌ను కాపాడుకునే క్ర‌మంలో ఈ చ‌ర్య తీసుకోవాల‌ని వారు కోరారు. జూన్ నెల‌లో ఇండియా తీసుకున్న నిర్ణ‌యాన్ని అమెరికా మెచ్చుకున్న‌ది. చైనా యాప్‌ల‌ను బ్యాన్ చేసి భార‌త్ అసాధార‌ణ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అమెరికా చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధులు తెలిపారు. టిక్‌టాక్‌ను కానీ ఇత‌ర చైనా యాప్‌ల‌ను అమెరికా న‌మ్మ‌వ‌ద్దు అంటూ వారు అధ్య‌క్షుడికి స‌మ‌ర్పించిన లేఖ‌లో తెలిపారు. చైనా సైట్ల‌పై ట్రంప్ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యాన్ని కూడా ప్ర‌తినిధులు స‌మ‌ర్థించారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/