స్టీల్ పాత్రలకు బంగారు మెరుపులు

వంటింట్లో ఆకర్షణీయమైన వస్తువులు

Gold sparkles for steel utensils


స్వర్ణకాంతులతో మెరిసిపోయే కప్పుల్లో టీ పోసి, ఆ పక్కనే అదే పసిడి మెరుపుల ప్లేట్లలో స్నాక్స్‌ పెట్టి ఇంటికొచ్చిన అతిథులకు అందిసుతంటే వారి కళ్లు కూడా కనకంలా వెలిగిపోవడం ఖాయం.

పచ్చటి పసుపురంగులో మెరిసే పుత్తడికి ఫిదా అవ్వని వాళ్లంటూ ఉండరు మరి. అందుకే, తరతరాలుగా అది ఆడవాళ అందన్నా పెంచే ఆభరణంగా స్థిరపోయింది.

రాజుల కాలంలో అయితే తినే ప్లేట్లూస్పూన్లు గిన్నెలూతాగే గ్లాసులూ కప్పులూ అన్నీ బంగారంతో చేసినవే ఉండేవి. ఇప్పటి సంపన్నులు కూడా కొందరు ఆ దార్లోనే నడుస్తున్నారు.

అలా అని వాళ్లు కేవలం తమ స్థాయిని చూపించేందుకే బంగారపు సామాను వాడతారనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే దర్పాన్ని చూపించాంటే బంగారు కన్నా విలువైన ప్లాటినంతోనూ గిన్నెల్ని చేయించుకోవచు,

అలా చేయ్యలేదంటే, పుత్తడి మెరుపుల్ని మెచ్చడమే అసలు కారణం అన్నమాట. అందుకే, పసిడిని కొనలేని సామాన్యులు ఇత్తడితోనైనా సరిపెట్టుకుందామనుకుని ఆ సామన్లనుకొనుక్కునేవారు.

కంచుకి కనకపురంగైతే ఉంది కానీ ఆ మెరుపు నిలవాలంటే ఎప్పటికప్పుడు దాన్ని బాగా తోముకుంటూ ఉండాలి. పైగా బరువూ ధర రెండూ ఎక్కువే. ఆ కారణంతోనే అందాన్ని పక్కనపెట్టి జనం నెమ్మదిగా స్టీలుకి అలవటు పడిపోయారు.

రోజులు మారాయి. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకోగలగడం ఈ తరం నైజం. ఇంకేముంది స్టీలుకి పుత్తడి అందాలద్దడం మొదలుపెట్టారు.

అవును, ఇక్కడ అచ్చం బంగారు గిన్నెల్లా కనిస్తున్నవన్నీ స్టీలు పాత్రేలే.

Gold sparkles for steel utensils

ఇలా చేస్తారు:

బంగారు నగల్ని చేయించుకునే స్థోమత లేకపోతే కనీసం వన్‌గ్రామ్‌ నగల్నైనా వేసుకుందామనుకుంటారు ఆడవాళ్లు. బంగారంతో చేసినవి ఉన్నా చీరకు మ్యాచింగ్‌ అనో డిజైన్‌ బాగుందనో కూడా రోల్డ్‌గోల్డ్‌ నగల్ని కొంటుంటారు

. అలాగే, కనకపు పళ్లెంలో భోజనం చేయాలని స్వర్ణకాంతులీనే కప్పుల్లోటీ తాగాలనే కోరిక ఉన్నవాళ్లు అచ్చంగా బంగారంతో చేసినవి కొనలేకపోయినా స్వర్ణంలా ఉండే స్టీలునైనా కొనుక్కుందాం అనుకుంటున్నారు.

ఈ రంగుకిఉన్న ఆకర్షణ వల్ల గోల్డ్‌ కలర్‌ స్టీల్‌ సామానుని ఎక్కడ పెడితే అక్కడ వేరే అలంకరణ సామగ్రి అవసరమే ఉండకపోవడం అదనపు హంగు.

స్టీలుకి ఎక్కువగా పివిడి (ఫిజికల్‌ వేపర్‌ డిపాజిషన్‌) కోటింగ్‌ పద్ధతిలోనే బంగారు రంగుల్ని అద్దుతున్నారు. ఇవి చూడ్డానికి నిజమైన బంగారు పాత్రల్లానే తళుకులీనుతుంటాయి.

ధర మాత్రం బాగా తక్కువ. పైగా స్టీలు పాత్రల్ని సులభంగా వాడుకోవచ్చు. శుభ్రం చేసుకోవచ్చు.

తోమేటపుడు రంగు పోదా అంటే వనగ్రామ్‌ గోల్డ్‌లాంటి వాటికి తక్కువ మోతాదులో బంగారాన్ని కరిగించిపూతగా పూస్తారు.

అది కొంతకాలానికి పోతుంది. కానీ పివిడి కోటింగ్‌ వేసేటపుడుప్తారల్ని టైటానియం నైట్రెడ్‌ ఉన్న వ్యాక్యూమ్‌ ఛాంబర్‌లోకి పంపి ప్రత్యేక పద్ధతిల్లో స్టీలు కనకపు రంగులోకి వచ్చేలా చేస్తారు.

దీనివల్ల స్టీలుకుండే మెరుపు అలాగే ఉండడంతోపాటు, అది బంగారు వర్ణంలోకి మారుతుంది.

రంగూ త్వరగా పోదు సరికదా అది పాత్రల్ని తుప్పు పట్టనివ్వకుండా ఎక్కువకాలం మన్నేలా చేస్తుంది.

పుత్తడి రంగులో మెరిసే తలుపు హ్యాండిళ్లూ గొళ్లాలూ చూస్తూనే ఉంటాం కదా అవి ఇలా తయారైనవే.

పాత్రల్ని అధిక ఉష్ణోగ్రతలకు గురి చేయడం, ఎలక్ట్రోప్లేటింగ్‌ లాంటి పద్ధతుల ద్వారానూ స్టీలుకి స్వర్ణకాంతుల్ని అద్దుతుంటారు.

వంటింట్లో వాడే స్ఫూన్ల దగ్గర్నుంచి ప్లేట్లూ పాన్లఊ గ్లాసులూ గిన్నెలు టీ కప్పులూ కాఫీ మగ్గులూ ఇతర వంట సామగ్రి వరకూ ఇందులేదు. అందుకలదనే సందేహం లేకుండా ఈ మధ్య అన్నిటికీ బంగారపు సోకులద్దేస్తున్నారు.

ఆఖరికి క్యారెట్‌ తురిమే గ్రేటర్‌, పిండి జల్లెడలూ చాకులు కూడా పుత్తడి కాంతులీనుతున్నాయి. ఆన్‌లైన్‌లోనూ ఇవి విరివిగా దొరుకుతున్నాయి.

అసలే స్టీలు పాత్రలు జిగేల్‌ జిగేల్‌మని కళ్లు చెదిరేలా తళతళలాడుతుంటాయి. ఇక, ఆ తళులకులకు బంగారు మెరుపులి జోడిస్తే అందమంతా వంటిల్లోనే ఉందా అనిపించకమానదు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/