లాక్ డౌన్ ప్రకటన తర్వాత రూ.56 కోట్లు తాగేశారు!

తెలంగాణలో మద్యం షాపుల వద్ద భారీ రద్దీ- రెట్టింపు అమ్మకాలు

లాక్ డౌన్ ప్రకటన తర్వాత రూ.56 కోట్లు తాగేశారు!
Double sales in liquor shops

Hyderabad: తెలంగాణలో లాక్‌డౌన్‌ విధింపు ప్రకటన అనంతరం మద్యం దుకాణాల వద్ద భారీ రద్దీ ఏర్పడింది. వందలాది మంది బారులు తీరారు. అవసరానికి మించి లిక్కర్ కొనుగోలు చేశారు. 10రోజులపాటు లాక్ డౌన్ కారణంగా పది రోజులకు సరిపడా మద్యాన్ని తీసుకువెళ్లేందుకు మద్యంషాపుల ముందు బారులు తీరారు. లాక్ డౌన్ ప్రకటన అనంతరమే మూడు గంటల వరకే రూ56 కోట్లు విలువైన మద్యం డిపోల నుంచి దుకాణాలకు సరఫరా కావటం విశేషం. ఆ తరువాత పెద్ద మొత్తంలో అమ్మకాలతో సుమారు రూ125 కోట్ల మద్యం అమ్ముడైందని తెలిసింది.

Rush at liquor shops in Telangana
Rush at liquor shops in Telangana

మే నెల 10 రోజులో రూ.676 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.రోజుకు సుమారు రూ.61 కోట్ల మేరకు అమ్మకాలు జరిగాయి. అయితే మంగళవారం ఒక్కరోజే రెట్టింపు అమ్మకాలు జరిగాయని దుకాణదారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో రూ.24 కోట్లకు పైగా అమ్మకాలు జరగా.. నల్గొండలో రూ.15. 24 కోట్లు, ఖమ్మంలో రూ.12.25 కోట్లు, హైదరాబాద్‌లో రూ.10.17 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఇదిలా ఉంటే ఇండెంటు పెట్టిన వెంటనే మద్యం చేరవేసేలా సంబంధిత శాఖ చర్యలు తీసుకుంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/