వైసీపీ గెలవకపోతే పథకాలు ఆపేస్తారు – ఎంపీ మిథున్ రెడ్డి

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు అన్నింటినీ ఆపేస్తారని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. త్వరలో ఏపీలో అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార – ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యాయి. వరుసపెట్టి ఇరు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తూనే..ప్రత్యర్థి నేతలపై మాటల యుద్ధం చేస్తున్నారు.

ఈ క్రమంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు అన్నింటినీ ఆపేస్తారని, అలాగే వాలంటీర్ వ్యవస్థను కూడా తీసేస్తారని చెప్పుకొచ్చారు. అన్ని పార్టీల నుంచి టీడీపీ అభ్యర్థులే పోటీలో ఉంటున్నారని వ్యాఖ్యానించారు. జనసేనకు ఇచ్చిన 21 సీట్లలో 10 మంది, కాంగ్రెస్, బీజేపీల్లోనూ టీడీపీ అభ్యర్థులే పోటీలో ఉంటున్నారని పేర్కొన్నారు. టీడీపీకి కాంగ్రెస్ కోవర్టుగా పని చేస్తోందని ఆరోపించారు.