జగన్ ఇంటి ముందు నిర్మాణం కూల్చివేత..అధికారిపై వేటు

హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్ ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా ఝలిపించింది. జగన్ ఇంటిముందు ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు శనివారం కూల్చివేశారు. గతంలో జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి మరీ గదులను సిబ్బంది నిర్మించడం జరిగింది. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు.

ఈ ఘటనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ ఫై వేటు పడింది. ఆయనను GAD(సాధారణ పరిపాలన విభాగం)కి అటాచ్ చేస్తూ GHMC ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలిచ్చారు. అధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి ముందు షెడ్లను కూల్చివేసినందుకు హేమంత్పై చర్యలు తీసుకున్నారు.