ఆర్టీసీ బస్సు ఢీకొని 8 మంది మృతి

రోడ్డు ప్రమాదాలు అనేవి ప్రతి రోజు కామన్ గా మారిపోయాయి. ఉదయం లేచినదగ్గరి నుండి రాత్రి వరకు అనేక ప్రమాద వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అతివేగం , మద్యం మత్తు , నిద్ర మత్తు ఇలా అనేక కారణాలతో ప్రమాదాలు అనేది జరుగుతూ అమాయకపు ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు.

‘ఈరోజు ఉద యం ముంబయి – ఆగ్రా జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, ట్రక్కు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది స్పాట్ డెడ్ అయ్యారు వారి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం. కేసు నమోదు చేసుకుని ఘటనకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. ప్రస్తుతం మృతదేహాలను ఆస్పత్రికి తరలించాం.’ అని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు