గడప గడపకు మన ప్రభుత్వం : అవంతి శ్రీనివాసరావు ఊళ్లోకి రాకుండా చెప్పులతో అడ్డుకట్ట

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుకు చుక్కెదురైంది. ఎమ్మెల్యే తమ గ్రామానికి రాకుండా గ్రామ టీడీపీ మాజీ అధ్యక్షుడు తొత్తడి సూరిబాబు, మరికొందరు కలిసి రోడ్డుకు అడ్డంగా పాత చెప్పుల దండకట్టారు. వైస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంది. కానీ ఈ కార్య క్రమం ద్వారా నేతల పనితీరు ఎలా ఉందో..ప్రజలు ప్రభుత్వం ఫై ఎంత ఆగ్రహం గా ఉన్నారో తెలుస్తుంది. ఇప్పటికే ఎంతోమంది నేతలకు చేదుఅనుభవం ఎదురుకాగా..తాజాగా భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ఇదే జరిగింది.

విశాఖ జిల్లా భీమిలి మండలం కె.నగరపాలేనికి వెళ్లిన మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు చుక్కెదురైంది. ఎమ్మెల్యే తమ గ్రామానికి రాకుండా గ్రామ టీడీపీ మాజీ అధ్యక్షుడు తొత్తడి సూరిబాబు, మరికొందరు కలిసి రోడ్డుకు అడ్డంగా పాత చెప్పుల దండ కట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన సీఐ కె.లక్ష్మణమూర్తి సిబ్బందితో వెళ్లి దాన్ని తొలగించారు. అనంతరం సూరిబాబును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించగా నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు మరుపల్లి రాజేంద్ర, యువకులు అడ్డుకున్నారు. అనంతరం గడప గడపకు కార్యక్రమాన్ని తన సెల్‌ఫోన్‌తో చిత్రీకరిస్తున్న రాజేంద్రను స్థానిక వైస్సార్సీపీ కార్పొరేటర్‌, ఆ పార్టీ నాయకులు అడ్డుకోవడంతో టీడీపీ నాయకులకు, వారికి మధ్య తోపులాట జరిగింది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణగడంతో ఎమ్మెల్యే తన కార్యక్రమాన్ని కొనసాగించారు.