ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారభించాలంటూ కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

Bandi Sanjay criticisms on KCR
Bandi Sanjay -KCR

తెలంగాణా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారభించాలంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ..ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసారు. తెలంగాణ స‌ర్కారు అన్ని ప్ర‌గల్భాలే ప‌లుకుతోందని అందులో పేర్కొన్నారు. వ‌డ్లు కొనుగోలు చేస్తామ‌ని తెలంగాణ స‌ర్కారు ప్రకటించి 15 రోజులు అవుతోంద‌ని, ఇప్ప‌టికీ కొనుగోళ్లు జ‌ర‌గ‌డం లేద‌ని ఆరోపించారు. వెంట‌నే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయ‌న అన్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటిస్తోన్న తనకు అనేక మంది రైతులు ప‌లు విష‌యాలు చెప్పార‌ని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని అన్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే మరో ఉద్యమాన్ని తెరపైకి తీసుకు వస్తామని హెచ్చరించారు బండి సంజయ్. ప్లీనరీలో వలసలు ఆగాయని తమ కార్యకర్తలకు సీఎం కెసిఆర్ అబద్ధాలు చెప్పారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ అసమర్థ పాలన లో బతికే దారి లేక ఉపాధి దొరక్క రోజూ వందల మంది ముంబైకి వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.