ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రోసారి తుపాకుల మోత..ఏడుగురు నక్సల్స్ హ‌తం

Chhattisgarh.. 7 Naxals killed in ongoing encounter with forces in Narayanpur district

న్యూఢిల్లీః ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రోసారి తుపాకుల మోత మోగింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఏడుగురు మావోయిస్టులు హ‌తమ‌య్యారు. నారాయ‌ణ్‌పూర్ జిల్లా అబుజ్ మ‌డ్ అట‌వీ ప్రాంతంలో పోలీసులు, న‌క్స‌ల్స్ మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో న‌లుగురు న‌క్స‌ల్స్ మృతిచెందారు. ఘ‌ట‌నాస్థ‌లి నుంచి పోలీసులు భారీ మొత్తంలో తుపాకులు, పేలుడు ప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఇంకా కాల్పులు కొన‌సాగుతున్న‌ట్లు స‌మాచారం. ఈ కాల్పుల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

కాగా, సోమవారం రాత్రి నుంచే గాలింపు చేపట్టిన ఈ బృందాలు.. మంగళవారం ఉదయం నక్సల్స్ ఉన్న ప్రాంతానికి చేరుకోగా వీరిని చూసిన నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా దళాలు నలుగుర్ని మట్టుబెట్టాయి. మరికొందరు పరారైనట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోందని పేర్కొన్నారు.