‘ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి భంగపాటు తప్పదు’

‘ధూళిపాళ్ల’ కుటుంబానికి లోకేష్ పరామర్శ

Nara Lokesh
Nara Lokesh

Ponnur: సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను అరెస్ట్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ధూళిపాళ్ల సతీమణి జ్యోతిర్మయి కి ఆయన ఫోన్ సంఘటన వివరాలు తెలుసుకున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో దాదాపు 400 మంది పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి భయానక వాతావరణం సృష్టించారని జ్యోతిర్మయి తెలిపారు.

విచారణకు తాము అన్నివిధాల సహకరిస్తామని చెప్పినా వినకుండా పోలీసులు యుద్ధ వాతావరణాన్ని సృష్టించారని ఆమె ఆరోపించారు. లోకేష్ స్పందిస్తూ ధూళిపాళ్ల కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దు అని ఆయన కోరారు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందన్నారు. ధూళిపాళ్ల పై అక్రమ కేసులో ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి భంగపాటు తప్పదని ఆయన పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/