రంగుల వేయడం వల్ల రూ.1400 కోట్లు వృధా

ఇకనైనా ప్రజాధనం దుర్వినియోగం మానుకోండి: కన్నా

kanna laxmi narayana
kanna laxmi narayana

అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వం కార్యాలయాలకు వైకాపా రంగులు తోలగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటినుండి రంగుల పిచ్చి పట్టుకుందని , పాఠశాలలు, గ్రామ సచివాలయాలు. బోరు పంపుల నుంచి స్మశాన వాటిక వరకు అన్నింటికి రంగులు వేస్తు వేళ్లారు. చివరకు విజ్ఞత మరచి జాతీయ జెండాను తొలగంచి రంగులు వేశారు. వైకాపా రంగుల రాజకీయం పరాకాష్టకు చేరుకుంది. దీనివల్ల సుమారు రూ.1400కోట్లు దుర్వినియోగం అయింది అని అన్నారు. ప్రజా ధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం అక్రమం అంటు ఎన్నోసార్లు బిజెపి హెచ్చరించింది. అని అన్నారు. ఇపుడు హైకోర్టు తీర్పు మేరకు తిరిగి ఆ రంగులను తొలగించడానికి ఎంత ప్రజాధనం వృధా చేస్తారో అని అన్నారు. ఇకనైనా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం మానుకోవాలని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/