‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు ప్రారంభించిన సిఎం జగన్‌

CM Jagan started ‘Adudam Andhra’ competition

అమరావతిః సిఎం జగన్‌ ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు కిట్లను అందజేసిన సీఎం జగన్ అనంతరం మాట్లాడారు. ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలురాయి అన్నారు. ఇది అందరూ పాల్గొనే గొప్ప పండగ.. 47 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు.

ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితంలో క్రీడలు అవసరం అన్నారు. క్రీడలతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని వివరించారు. మంచి ఆరోగ్యానికి స్పోర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులను పరిచయం చేయడమే లక్ష్యం అన్నారు.

గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తామని సిఎం జగన్‌ ప్రకటించారు. నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ప్రతి ఊరికి ప్రతి ఒక్కరికీ పండుగే అని తెలిపారు. గ్రామ గ్రామాలలో ఆరోగ్య అవగాహన కోసం క్రీడలు ప్రాముఖ్యాన్ని తెలియ చెప్పే ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించారు.