అట్టహాసంగా ముగిసిన వైస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు

వైస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు ముగిసాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. అలాగే వైస్సార్సీపీ పార్టీకి జీవితకాలపు అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక రెండో రోజు సమావేశాల్లో పలువురు నేతలు వేదిక ఫై మాట్లాడారు. జగన్ సంక్షేమ పథకాల గురించి , రాష్ట్ర అభివృద్ధి గురించి , జగన్ పాలన గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు.

ఇక జగన్ తన ప్రసంగంలోనూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి చేసిన పనుల గురించి , సంక్షేమ పథకాల గురించి వివరించారు. మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో అవన్నీ అమలు చేస్తూ వస్తున్నట్లు తెలిపారు. నా ఫోకస్‌ అంతా ప్రజలకు మంచి చేయడమే. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడమే నా లక్ష్యం. ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు 151కి చేరిందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. అలాగే వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా అక్కా చెల్లెమ్మలకు రూ. 9,180 కోట్లు ఇచ్చామని , వైఎస్సార్‌ ఆసరా ద్వారా అక్కా చెల్లెమ్మలకు రూ. 12, 758 కోట్లు ఇచ్చామని , మూడేళ్లలో వ్యవసాయం రంగంపై రూ. లక్షా 27వేల కోట్లు ఖర్చు చేశామని జగన్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు కోసం రూ. 45 వేల కోట్లు ఖర్చు చేసినట్లు , ఉచిత విద్యుత్‌ కోసం రూ. 27వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మూడేళ్లలో ఒక్క రైతు భరోసా ద్వారానే రూ. 23,875 కోట్లు ఇచ్చినట్లు జగన్ తెలిపారు. మూడేళ్లలో మ్యానిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేశాం ఈ సందర్బంగా తెలిపారు.

అలాగే మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీని ఎదురించిన ఏకైక మొనగాడు సీఎం జగన్‌ అని చెప్పుకొచ్చారు. ఇక టీడీపీని బంగాళాఖాతంలో కలిపేశామన్నారు. ఇక కొడాలి నాని సైతం తనదైన శైలిలో చంద్రబాబు ఫై నిప్పులు చెరిగి , మరోసారి వైసీపీ కార్యకర్తల్లో ఉత్సహం నింపారు. అలాగే మిగతా నేతలంతా కూడా జగన్ పాలన గురించి ప్రసంగించారు.