నా మీద లోకేష్ , చంద్రబాబు లు పోటీ చేసిన గెలువ లేరు – కొడాలి నాని

గుడివాడ వైస్సార్సీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. నా మీద లోకేష్ , చంద్రబాబు లు పోటీ చేసిన గెలవరన్నారు. వేల కోట్లు ఖర్చు చేసినా, కుల సంఘాలు వచ్చినా తన గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ను తిట్టేందుకే చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సీఎం కాకపోతే రాష్ట్ర ప్రజలకు పోయేదేమీ లేదని అన్నారు. చంద్రబాబుకే కాదు, టీడీపీకి కూడా 2024 చివరి ఎన్నికలు అని అన్నారు. రాష్ట్ర ప్రజలను టీడీపీ పార్టీ మోసం చేసిందన్నారు.

తాను ఎవరికీ భయపడేది లేదని, ఎంతమంది వచ్చినా గుడివాడను ప్రభావితం చేయలేరన్నారు. గుడివాడలో చంద్రబాబు పోటీ చేసినా తాను రెడీ అన్నారు. చంద్రబాబును మించిన సైకో మరొకరు లేరన్నారు. కర్నూలులో హైకోర్టు గురించి న్యాయవాదులు ప్రశ్నిస్తే గుడ్డలూడదీసి కొడతానని చంద్రబాబు మాట్లాడాడని గుర్తుచేశారు. 2024 ఎన్నికల తరువాత ఇదేం ఖర్మరా అని బాబు, లోకేష్‌ అనుకుంటారని కొడాలి నాని ఎద్దేవా చేశారు.