తండ్రి అవుతున్నట్లు వస్తున్న వార్తలపై రానా క్లారిటీ

దగ్గుపాటి రానా త్వరలో తండ్రి కాబోతున్నట్లు గత కొద్దీ రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాటికీ రానా క్లారిటీ ఇచ్చారు. రానా తండ్రి కాబోతున్నాడంటూ గాయని కనికా కపూర్ ఓ ట్వీట్ చేయడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి రానా స్పందించారు. తన భార్య మిహీక గర్భవతి కాదని కనికా కపూర్ కు స్పష్టం చేశారు.

మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని వివరించారు. అంతేకాదు, నాకు బిడ్డ పుడితే కచ్చితంగా చెబుతాను… అలాగే నీకు బిడ్డ పుడితే నువ్వు కూడా చెప్పాలి అంటూ కనికా కపూర్ ను ఉద్దేశించి రానా కామెంట్ చేసారు. గత ఏడాది ఆగస్ట్ 8న రానా, మిహిక బజాజ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక రానా సినిమాల విషయానికి వస్తే..దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వచ్చిన రానా..తెలుగు తో పాటు హిందీ లోను పలు సినిమాలు చేసి మెప్పించాడు. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు.