చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది – బొత్స

botsa-comments-on-chandrababu

అవినీతి గురించి టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి బొత్స. ఈ నెల 23 న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించబోతున్నారు. ఈ సందర్బంగా పర్యటన ను విజయవంతం చేయాలనీ మంత్రులు బొత్స , ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు లు పిలుపునిచ్చారు. సీఎం రాక దృష్ట్యా న‌ర‌స‌న్న‌పేటలో స‌న్నాహ‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బొత్స మాట్లాడుతూ..చంద్రబాబు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.చంద్రబాబుకు వైస్సార్సీపీ ని ప్రజలు బలపరుస్తున్నారనే భయం పట్టుకుందన్నారు. ఏం చేసైనా సరే రాజకీయ లబ్ధి పొందాలన్నదే చంద్రబాబు తపన అని అన్నారు.

చంద్రబాబు మాటలు నీచాతి నీచంగా ఉన్నాయయని.. ఆయనొక్కడే నిజాయితీ, సచ్చీలుడిలా మాటాడుతున్నారని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ఈ వయసులో చంద్రబాబు ఎందుకు సహనం కోల్పోతున్నారని ప్రశ్నించారు. తమకు కూడా మాటలు వచ్చని.. రాజ్యాంగాన్ని గౌరవించబట్టే మాటాడటం లేదన్నారు. ప్రతి చిన్న అంశాన్ని చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తమకు చంద్రబాబు మాదిరిగా అబద్దాలు, ఫ్యాబ్రికేట్ చేస్తూ పబ్లిసిటీ చేస్తూ మాటాడాల్సిన‌ పనిలేదన్నారు.

ఇక ఈ నెల 23 న జగన్ వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష (రీ సర్వే) రెండో విడత కార్యక్రమాన్ని ప్రారభించనున్నారని బొత్స తెలిపారు. 23వ తేదీ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11.00 – 12.55 వరకు బహిరంగ సభలో సీఎం ప్రసంగం, లబ్ధిదారులకు పత్రాల పంపిణీ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని తెలిపారు.