రెండురోజుల పాటు కేసీఆర్ ప్రచారం చేయొద్దంటూ ఈసీ ఆదేశం

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈసీ షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చెయ్యొదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు రాత్రి 8 గంట‌ల నుంచి 48 గంట‌ల పాటు కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై నిషేధం విధించిన‌ట్లు ఈసీ వెల్ల‌డించింది. కాంగ్రెస్ నేత‌ల ఫిర్యాదు మేర‌కు కేసీఆర్‌పై ఈసీ చ‌ర్య‌లు తీసుకుంది. సిరిసిల్ల‌లో కాంగ్రెస్ నేత‌ల‌పై కేసీఆర్ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశార‌ని కాంగ్రెస్ నేత నిరంజ‌న్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు మేరకు ఈసీ నిషేధం విధించింది.

ఈసీ ఆదేశాల ఫై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. నా మాట‌ల‌ను అధికారులు స‌రిగా అర్థం చేసుకోలేదు. స్థానిక మాండ‌లికాన్ని అధికారులు అర్థం చేసుకోలేదు. కాంగ్రెస్ నేత‌లు కొన్ని వ్యాఖ్య‌ల‌ను ఎంపిక చేసుకొని ఫిర్యాదు చేశారు. నా వ్యాఖ్య‌ల‌కు ఆంగ్ల అనువాదం స‌రికాదు. కాంగ్రెస్ విధానాలు, హామీల అమ‌ల్లో వైఫ‌ల్యాన్నే ప్ర‌స్తావించాను అని కేసీఆర్ వివ‌ర‌ణ ఇచ్చారు.