నెలాఖరు దాకా లాక్డౌన్ పొడిగింపు
-కేంద్ర హోమ్‌శాఖ ఉత్తర్వుల జారీ

ముఖ్యాంశాలు:
- కరోనా విజృంభణ కొనసాగుతున్న కారణంగానే లాక్డౌన్ పొడిగింపు
- లాక్‌డౌన్‌ను పొడిగించటం ఇది నాల్గవసారి
- పలు కార్యకలాపాలు కొనసాగించేలా మినహాయింపులు
New Delhi:
దేశంలో లాక్‌డౌన్‌ను మరో 14 రోజులపాటు పొడిగిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి నేటితో (ఆదివారం) లాక్డౌన్ ముగియనుండగా, మరో 14 రోజులపాటు లాక్డౌన్ కొనసాగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ను పొడిగించటం ఇది నాలుగోసారి.. అయితే లాక్డౌన్ 4.0లో పలు కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా పలు మినహాయింపులు ఇచ్చింది.
కొత్త మార్గదర్శకాలను కూడ కేంద్ర విడుదల చేసింది.
తాజా ‘నిఘా వార్తల కోసం : https://www.vaartha.com/specials/devotional/