ఢిల్లీలో ఘనంగా విజయ్‌ దివస్‌ వేడుకులు

పాక్పై భారత్ విజయాన్ని స్మరించుకుంటూ రాజ్‌నాథ్ సింగ్ నివాళులు

rajnath-singh-lays-wreath-at-national-war-memorial-on-vijay-diwas

న్యూఢిల్లీః 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విజయ్ దివస్ సందర్భంగా నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళుల అర్పించారు. అప్పటి యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ..వారికి నివాళులు అర్పించారు. అంతకుముందు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి, భారత నేవీ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ ఘోర్మాడే కూడా జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/