తెనాలి కంటోన్మెంట్లో వైద్య పరీక్షలు, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బీవీ రమణ

Tenali MHO Dr BV Ramana

ముఖ్యాంశాలు:

  • కంటోన్మెంట్‌ పరిధిలోకి తెనాలి 29వ వార్డు
  • ప్రతి ఇంటికీ అయిదుగురు మెడికల్‌ ఆఫీసర్ల పర్యవేక్షణ
  • ఇళ్లవద్దకే కూరగాయలు, పాలు, మెడిసిన్స్‌,నిత్యావసరాలు, మంచినీరు
  • ఇళ్లనుంచే తడి,పొడి చెత్త సేకరణ
  • టోల్‌ఫ్రీ నెంబర్‌:1800 425 3582

Tenali:

కంటోన్మెంట్ ప్రాంతమైన 29వ వార్డు లోని సుల్తానాబాద్ ఏరియాలో హెల్త్ ఆఫీసర్ శ్రీ బి వి రమణ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ ప్రాంతంలో ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం మరియు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ, సుల్తానాబాద్ కంటోన్మెంట్ ప్రాంతo ఏర్పాటు చేసిన కోవిడ్ -19 కంట్రోల్ రూమ్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.

టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 3582 నకు ఫోన్ చేసి ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు.

కంటోన్మెంట్ జోన్ లో ప్రతి ఇంటికి 5 గురు మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షణలో ఆశా కార్యకర్తలు, ఏ ఎన్ ఎంలు మరియు వార్డు వాలంటీర్లు సమన్వయముతో కరోనా పై అవగాహన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు

ప్రతి ఇంటిలో ప్రజలు ఆరోగ్య వివరాలు సేకరించి, ముఖ్యముగా ప్రత్యేకముగా ఆ ప్రాంతములోని గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తుల మరియు వృద్ధుల వివరాలు సేకరించడం జరుగుతుందని తెలిపారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఇంటింటికి చెత్త సేకరణ లో భాగంగా ఇంటివద్ద నుండి తడి, పొడి చెత్త సేకరణ చేయడం జరుగుతుందని తెలిపారు.

మురికి కాలువలు శుభ్రం చేయటం, స్ప్రేయింగ్ చేయించడం, సోడియం హైపోక్లోరైద్ ద్రావణం  స్ప్రే చేయించడం మరియు బ్లీచింగ్ చల్లించడం జరుగుతుందని తెలిపారు.

కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రజలు ఎవరు బయటకు రాకుండా వారి ఇంటి వద్దకే కూరగాయలు, పాలు, నిత్యావసర సరుకులు మరియు మంచి నీటిని ప్రతి రోజు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు.

శానిటరీ ఇన్స్పెక్టర్ డి. శ్రీనివాసరావు, ఆకురాతి రామచంద్రరావు, షేక్ బాజీ హుస్సేన్, ఆరోగ్య విస్తరణాధికారి అందె బాల చంద్ర మౌళి, ఏ ఎన్ ఎం విజయ కుమారి, లీగల్ సర్వీసు అధారిటి వారైన బాలాజీ నాయక్, ప్రనాజిత్ కుమార్, శ్రీ లక్ష్మి కోవిడ్ -19 పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

వార్డు సెక్రటరీలు పి రాజ్ కుమార్, ఉమామహేశ్వరరావు లతోపాటు కంట్రోల్ రూమ్ నందు వార్డు మహిళా పోలీసులు జోష్న శ్రీ, బి. భవ్య, మహమ్మద్ జరీనా మరియు వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/