ఫైనలియర్‌ పరీక్షలు నిర్వహించాల్సిందే

పరీక్షలు రాయకుండా మాత్రం ఎవరినీ పాస్ చేయద్దు..సుప్రీంకోర్టు

supreme court
supreme court

న్యూఢిల్లీ: కళాశాలలు, వర్సిటీల విద్యార్థుల ఫైనల్‌ ఇయర్‌ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. ఫైనల్ ఇయర్ విద్యార్థినీ, విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండా, తదుపరి తరగతులకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఆదేశాల మేరకు ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయరాదని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు యూజీసీతో సంప్రదించి, పరీక్షల నిర్వహణకు తేదీలను ఖరారు చేయవచ్చునని తెలిపింది. మహమ్మారి సమయంలో తగిన తేదీని ఖరారు చేసి, ఫైనలియర్ పరీక్షలు నిర్వహించవచ్చునని పేర్కొంది. యూజీసీ ప్రకటించిన సెప్టెంబరు 30 గడువును రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించవలసిన అవసరం లేదని తెలిపింది.

ఫైనలియర్ ఎగ్జామినేషన్స్ తప్పనిసరిగా నిర్వహించాలని యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలు సరైనవేనని తెలిపింది. పరీక్షలు నిర్వహించకుండా ప్రమోషన్ చేయరాదన్నది కూడా సరైనదేనని పేర్కొంది. కోవిడ్ దృష్ట్యా పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే, యూజీసీతో సంప్రదించి, కొత్తగా తేదీలను ఖరారు చేసుకోవచ్చునని తెలిపింది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/