పీఆర్సీ స్టీరింగ్ క‌మిటీ సమావేశం

అమరావతి: ఏపీ లో పీఆర్సీ ర‌గ‌డ కొన‌సాగుతోంది. పీఆర్సీ స్టీరింగ్ క‌మిటీ స‌మావేశ‌మైంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఉద్యోగ సంఘాలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోవాలని ఇప్పటికే పలు మార్లు ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలను కోరింది. అంతేకాకుండా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ఏపీ ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రుల క‌మిటీతో చ‌ర్చించాల్సిన ప‌లు అంశాల‌పై ఈ స్టీరింగ్ క‌మిటీ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/