వేదాద్రి ఎత్తిపోతలకు సిఎం జగన్‌ శంకుస్థాపన

YouTube video
Laying foundation virtually to”Y.S.R VEDADRI LIFT IRRIGATION SCHEME” by Hon’ble CM of AP

అమరావతి: పశ్చిమ కృష్ణా తీరంలోని జగ్గయ్యపేట మండలం వేదాద్రి క్షేత్రం వద్ద రూ.368 కోట్లతో నిర్మించనున్న వైఎస్‌ఆర్‌ వేదాద్రి ఎ్తిపోతల పథకానికి సిఎం జగన్‌ వర్చువల్‌ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ ఎత్తిపోతల పథకంతో జగ్గయ్యపేట నియోజకవర్గం సస్యశ్యామలం కానుంది. రూ.368 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని 18 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనులు చేపట్టింది. జగ్గయ్యపేట మండలంలో 8 గ్రామాలు, వత్సవాయి మండలంలో 10 గ్రామాలు, పెనుగంచిప్రోలు మండలంలో 10 గ్రామాల్లో 38,607 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈకార్యక్రమంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, జగ్గయ్యపేట ఎమ్మెల్యెసామినేని ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/