హైదరాబాద్ లో ఆకట్టుకునే దృశ్యాలను చూపించిన కేటీఆర్

హైదరాబాద్..ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ వైపు చూస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత హైదరాబాద్ రూపు రేఖలే మారిపోయాయి. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు తెలంగాణ రూపు రేఖలు సైతం పూర్తిగా మారిపోయాయి. హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా మారింది. ఎన్నో దిగ్గజ సంస్థలు తమ పెట్టుబడులు పెట్టేందుకు అనువైన ప్రాంతంగా హైదరాబాద్ మారింది. ఇప్పటికే కొన్ని వందల సంస్థలు హైదరాబాద్ లో తమ వ్యాపారాలు నెలకొల్పి..వేలాదిమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అంతే కాదు హైదరాబాద్ నగరం పర్యాటక నగరంగా కూడా మారింది. నిత్యం సందర్శుకుల తాకిడితో కిక్కిరిసి పోతుంటుంది. రీసెంట్ గా మైక్రోసాఫ్ట్‌ తెలంగాణలో మరో రూ.16,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. అలాగే వాటర్‌ హీటర్ల తయారీకి సంబంధించిన ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. తెలంగాణలో వచ్చే ఏడేళ్లలో 36,300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు అమెజాన్ సైతం ముందుకు వచ్చింది.

ఇలాంటి హైదరాబాద్ లోని ఆకట్టుకునే దృశ్యాలను ఐటీ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి మరోసారి అందరిని ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ సంబంధించి సందర్శినీయ ప్రదేశాలు, నగర అభివృద్ధికి సంబంధించిన దృశ్యాలు ఈ వీడియో లో ఉన్నాయి. ట్యాంక్‌బండ్‌, చార్‌మినార్‌, కుతుబ్‌షాహి పార్క్‌, గండిపేట పార్క్, బన్సీలాల్ పేట మెట్ల బావి, టీ హబ్, పోలీస్ కమెండ్ కంట్రోల్ సెంటర్, షైక్ పేట ఫ్లైఓవర్, ముక్తి ఘాట్, ట్యాంక్ బండ్, కొత్తగా నిర్మిస్తున్న సెక్రేటెరియట్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్వే స్టేషన్, మెజాంజాహి మార్కెట్, మైండ్ స్పేస్ జంక్షన్ తదితర పార్కులు ఈ వీడియోలో చూడవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈ కింది ట్విట్టర్ వీడియో లో మీరు చూసెయ్యండి.