రాజ్‌ భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

మంత్రులుగా వేణుగోపాల కృష్ణ, అప్పలరాజు ప్రమాణం స్వీకారం

YouTube video

విజయవాడ: ఏపి మంత్రులుగా చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, అప్పలరాజు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్.. వారి చేత ప్రమాణం చేయించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 1.29 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఎం జగన్‌ స్పీకర్ తమ్మినేని, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కరోనా కారణంగా కొద్ది మంది అతిథులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో చాలా మంది రాజ్‌భవన్‌కు వచ్చినా లోనికి అనుమతించలేదు. కాగా పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక అవడంతో వారిరువురు మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారి స్థానంలో అప్పలరాజు, వేణుగోపాలకృష్ణకు మంత్రివర్గంలో అవకాశం దక్కింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/