ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌ బదిలీ

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ అయ్యారు. సీఐడీ ఏజీడీగా ఎన్. సంజయ్ నియామకమయ్యారు. సునీల్ కుమార్ ను జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ అదనపు డీజీగా నియమితులైన ఎన్‌.సంజయ్‌.. ప్రస్తుతం ఏపీ స్టేట్ డిజాస్టర్ అండ్ ఫైర్ సర్వీస్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతర్గత బదిలీల్లో భాగంగానే ఈ బదిలీ జరిగినట్టు తెలుస్తోంది. అయితే.. సడెన్‌గా సంజయ్‌కు.. ఏపీ సీఐడీ బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.

సునీల్ కుమార్..సీఐడీ అధికారులు ప్రతిపక్ష నేతల్ని తప్పుడు కేసులతో వేధిస్తున్నారని.. నిబంధనలకు విరుద్దంగా అరెస్టులు చేస్తున్నారని తీవ్ర విమర్శలు వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. ఆయితే హఠాత్తుగా ఆయనను బదిలీ చేయడం పోలీసు వర్గాల్లో సంచలనం రేపుతోంది. సాధారణం సీనియర్ అధికారులను బదిలీ చేస్తే.. పోస్టింగ్ ఇస్తారు. కానీ పీవీ సునీల్ ఒక్కరినే బదిలీ చేశారు.. పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. దీనికి కారణం ఏమిటన్నదానిపై అధికారవర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. సునీల్ కుమార్ 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఆయనకు ప్రమోషన్ ఇచ్చింది. అడిషనల్ డీజీ హోదా ఉండే ఆయనకు డీజీపీ హోదా ఇచ్చింది. అడిషనల్ డీజీపీ హోదాతో సీఐడీ చీఫ్ గా కొనసాగేవారు. డీజీగా ప్రమోషనల్ ఇచ్చారు. అయితే ఇలా డీజీగా ప్రమోషన్ ఇచ్చిన ఇరవై రోజుల్లోనే ఆయనను బదిలీ చేయడం.. అనూహ్యంగా మారింది.