కవితను కలిసి ధైర్యం చెప్పిన కేటీఆర్

ఢిల్లీ లిక్కర్ కేసులో మూడు రోజుల సీబీఐ కస్టడీలో ఉన్న కవితను తన అన్న మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ నిన్న ఆదివారం కలిశారు. కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సీబీఐ ఆఫీస్ లోకలిసి ధైర్యం చెప్పారు. న్యాయం తమవైపే ఉందని, అధైర్యపడవద్దని కవితకు కేటీఆర్ ధైర్యం చెప్పారు.

సోమవారం సీబీఐ కస్టడీ ముగియనుండటంతో మంగళవారం ఉదయం 10 గంటలకు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు. సీబీఐ అధికారులు మరోసారి ఆమె కస్టడీ గడువు పొడిగించమని కోరుతారో లేక జుడీషియల్ కస్టడీకి తరలిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే కవితకు ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిలును నిరాకరించిన సంగతి తెలిసిందే. మరోవైపు రేపు రెగ్యులర్ బెయిల్‌పై విచారణ జరగనుంది.