రాత్రి నిద్ర బాగా పట్టాలంటే..ఓ పెగ్‌ ఎక్స్‌ట్రా వేసుకోండి -మహిళా మంత్రికి బిజెపి సలహా

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మొదటి విడత పోలింగ్ లు కూడా పూర్తి అయ్యాయి. మరోపక్క అన్ని రాష్ట్రాల్లో అధికార – ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఈ తరుణంలో కర్ణాటక బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్‌ పాటిల్‌ ఆ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్‌ నేత లక్ష్మీ హెబ్బల్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి హెబ్బల్కర్‌ ఆందోళనకు గురవుతున్నారని, ఆమెకు నిద్ర పట్టడం లేదని అన్నారు.

రాత్రి నిద్ర పట్టాలంటే ఆమె స్లీపింగ్‌ పిల్‌ కానీ, ఎక్స్‌ట్రా పెగ్‌ కానీ వేసుకోవాలని అన్నారు. దీనిపై లక్ష్మి స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. మహిళలకు బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. బీజేపీ రహస్య ఎజెండా ఇదేనన్నారు. జై శ్రీరామ్‌ అని నినాదాలు చేయడంతో సరిపోదని, మహిళలను గౌరవించాలని హితవు పలికారు.