తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానితో చర్చించాః కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

komati-reddy-venkat-reddy-meets-pm-narendra-modi

న్యూఢిల్లీః భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంతో పాటు తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రధాని నరేంద్రమోడీతో చర్చించినట్లు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ప్రధానితో దాదాపు 20 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించానని, అడగ్గానే అపాయింట్ మెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మోడీతో భేటీలో ముఖ్యమంత్రి మూసీ నది కాలుష్యంపై చర్చించాననిస ననామి నది కింద మూసీ ప్రక్షాళన చేపట్టాలని కోరినట్లు వెంకట్ రెడ్డి చెప్పారు. గుజరాత్ లోని సబర్మతి నదిలా మూసీ రూపురేఖలు మార్చాలని విన్నవించానని అన్నారు. మూసీ నదిలో డ్రైనేజీ, పారిశ్రామిక వ్యర్థాలు కలవడం వల్ల లక్షల మంది అనారోగ్యం పాలువుతున్నారని వెంకట్ రెడ్డి ప్రధాని దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. తన విన్నపంపై స్పందించిన మోడీ మూసీ ప్రక్షాళనపై త్వరలోనే ఓ కమిటీ వేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

మూసీతో పాటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ అంశాన్ని ప్రధాని ముందు ఉంచానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రోడ్డు విస్తరణ చేయకపోవడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పారు. జనగాం, భువనగిరి మధ్య ఎంఎంటీస్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరానని, ఈ ప్రాజెక్టు వల్ల యాదాద్రికి వెళ్లే వారి సమస్య తీరుతుందని అన్నారు. ఈ అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను సైతం కలువనున్నట్లు వెంకట్ రెడ్డి ప్రకటించారు.

తానిప్పుడు కేవలం ఎంపీని మాత్రమేనని, ఏ కమిటీలో లేనందున కాంగ్రెస్ పార్టీ గురించి అడగొద్దని వెంకట్ రెడ్డి అన్నారు. తాను స్టార్ క్యాంపెయినర్ ను కాదని చెప్పారు. ఎన్నికలకు నెల రోజుల ముందు మాత్రమే మాట్లాడతానన్న ఆయన.. రాజకీయాల్లో కొనసాగుతానా లేదా అన్న అంశంపై అప్పుడే స్పష్టత ఇస్తానని అన్నారు. అప్పటి పరిస్థితుల ఆధారంగా ఎంపీగా పోటీ చేయాలో ఎమ్మెల్యేగా బరిలో దిగాలో నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/