తెలంగాణ బొబ్బిలి ‘షర్మిల’ – వైస్ విజయమ్మ

తెలంగాణ బొబ్బిలి ‘షర్మిల’ అని..పాలేరు తెలంగాణను పాలించే ఊరు అవుతుందని..పాలేరు ఇక నుంచి అభివృద్ధికి, సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ అవుతుందని హామీలు కురిపించారు వైస్ విజయమ్మ. శుక్రవారం పాలేరులో YSRTP కార్యాలయ నిర్మాణానికి భూమి పూజా జరిగింది.

ఈ సందర్బంగా విజయమ్మ మాట్లాడుతూ..తెలంగాణలో వెనుబడిన వర్గాల బాగు కోసం, నిరాదరణకు గురైన వర్గాల బాగు కోసం తొలిమెట్టు అని, ప్రజలకు మంచి చేయాలని, వారి జీవితాలు బాగు చేయాలని గొప్ప సంకల్పంతో షర్మిలమ్మ ముందుకెళ్తోందన్నారు. ప్రజల కోసం పాద యాత్ర చేస్తే తెలంగాణ ప్రభుత్వం షర్మిలను అడ్డుకునే ప్రయత్నం చేసిందని చెప్పారు. బస్సులు, వాహనాలు తగలబెట్టినా..మొక్కవోని దీక్షతో షర్మిల ముందుకెళ్తోందన్నారు. అరెస్టులు చేసినా…పోలీస్ స్టేషన్ లో గంటలు గంటలు నిర్భంధించినా సహనంతో భరించిందన్నారు. ప్రజలకు సేవ చేయాలనుకోవడం, ప్రజా సమస్యలపై పోరాడటం షర్మిల చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే లాఠీ చార్జ్ చేశారని తెలిపారు.

రైతులను కాపాడు దొరా అని అంటే అరెస్ట్ చేశారన్నారు. ప్రజల బాధలను తీర్చండని అడిగితే కొట్టి, తిట్టి, ఈడ్డుకెళ్లారున్నారు. ఎన్ని చేసినా వైఎస్ రక్తం దేనికి భయపడదన్నారు. ఎన్ని నిర్బంధాలు సృష్టించినా..అరెస్టులు చేసినా..ప్రజల నుంచి..తెలంగాణ నుంచి షర్మిలను వేరుచేయలేరన్నారు. పాలేరు తెలంగాణను పాలించే ఊరు అవుతుందని, పాలేరు ఇక నుంచి అభివృద్ధికి, సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ అవుతుందని ధీమా వ్యక్తం చేసారు.