గద్దర్ సాంగ్ కు వర్మ డాన్స్ ..

వివాదాస్పద డైరెక్టర్ గా గుర్తింపు ఉన్న రామ్ గోపాల్ వర్మ..తాజాగా గద్దర్ సాంగ్ కు డాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వర్మ కొండా మూవీ తో ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కొండా మురళీ ధర్ రావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ను తెరకెక్కించారు. వరంగల్, వంచనగిరి పరసర ప్రాంతాల్లోనే ఈ చిత్ర మేజర్ పార్ట్ షూటింగ్ జరిగింది. 1990 ప్రాంతంల్లో నాటి పరిస్థితులను సినిమాలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు వర్మ. కొండా మురళి-సురేఖ మధ్య ఉన్న లవ్ స్టోరి, ఆనాటి రాజకీయ, సామాజిక పరిస్థితులను వెండితెరపైన ఆవిష్కరించనున్నారు. నక్సలైట్లతో కొండా మురళికి ఉన్న సంబంధం, రాజకీయ ఎత్తుగడలను సైతం సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.

కాగా ఈ చిత్ర ప్రమోషన్ లలో భాగంగా నిన్న శనివారం వరంగల్ లో ప్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా జరిపారు. కాగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డిని రావాల్సి ఉండేది..కానీ పలు కారణాల కారణంగా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, ఈ సినిమా ఫంక్షన్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మనే ప్రత్యేక ఆకర్షణగా నిలవడం గమనార్హం. ప్రీ రిలీజ్ వేడుక లో గద్దర్ సాంగ్ కు వర్మ అదిరిపోయే స్టెప్స్ వేసి ఫంక్షన్ కు హైలైట్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ‘కొండా” చిత్రాన్ని యాపిల్ ట్రీ/ఆర్జీవీ నిర్మాణంలో శ్రేష్ఠా పటేల్ మూవీస్ సమర్పణలో కొండా సుష్మిత పటేల్ నిర్మించారు. మరి ఈ మూవీ ఇలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.