ప్రధాని మోడీతో ముగిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..శుక్రవారం ప్రధాని మోడీ తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 12.10 నుంచి 12.20 గంటల వరకు 10 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. ప్రధానిని కలవబోతుండటం వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని .. అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించేందుకే ప్రధానిని కలుస్తున్నానని భేటీకి ముందు వెంకట్ రెడ్డి చెప్పడం జరిగింది. మూసీ నది ప్రక్షాళనకు రూ. 3 వేల కోట్లు ఇవ్వాలని కోరనున్నట్టు చెప్పారు. భువనగిరి నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు ఇతర పనులకు నిధులను మంజూరు చేయాలని కోరుతానని చెప్పుకొచ్చారు.

ఇక భేటీ అనంతరం మాట్లాడుతూ..భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంతో పాటు తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రధాని మోడీతో చర్చించినట్లు తెలిపారు. అలాగే వివిధ అంశాలపై చర్చించానని, అడగ్గానే అపాయింట్ మెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మోడీతో భేటీలో ముఖ్యమంత్రి మూసీ నది కాలుష్యంపై చర్చించాననిస ననామి నది కింద మూసీ ప్రక్షాళన చేపట్టాలని కోరినట్లు వెంకట్ రెడ్డి చెప్పారు. గుజరాత్ లోని సబర్మతి నదిలా మూసీ రూపురేఖలు మార్చాలని విన్నవించానని అన్నారు. మూసీ నదిలో డ్రైనేజీ, పారిశ్రామిక వ్యర్థాలు కలవడం వల్ల లక్షల మంది అనారోగ్యం పాలువుతున్నారని ప్రధాని దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. తన విన్నపంపై స్పందించిన మోడీ మూసీ ప్రక్షాళనపై త్వరలోనే ఓ కమిటీ వేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.