ఆల్‌ ఇన్‌ వన్‌

వంటింటి చిట్కాలు

Cooking
Cooking

వంట పొయ్యి మీద నుంచి స్టవ్‌ మీదకు, స్టవ్‌ మీద నుంచి ఎలక్ట్రిక్‌ గాడ్జెట్స్‌ మీదకు వచ్చిన తర్వాత అంతా సులభమై పోయింది.

ఇప్పుడు ఎలాంటి వంటైనా నిమిషాల్లో ఊడికి పోతుంది. స్విచ్‌ ఆన్‌ చేస్తే చాలు వేళకు వండివార్చే మెషిన్స్‌ మార్కెట్‌లో పోటెత్తున్నాయి.

అందులో భాగమే ఈ కుక్కర్‌ దీన్ని అవసరాన్ని బట్టి ఏ విధంగానైనా ఉపయెగిం చుకోవచ్చు.అ కు అనువైన అన్ని సౌకర్యాలలూ ఈ కుక్కర్‌లో ఉన్నాయి.

అవసరాన్ని బట్టి ఇందులో అన్నం, పప్పు, కూరగాయలు సిద్ధం చేసుకోవచ్చు. నూడూల్స్‌, పాయసం వంటి వెరైటీలను సిద్ధం చేసుకోవచ్చు.

మేకర్‌ ముందు భాగంలో ఉన్న డిస్‌ప్లేలో మెనూ కనిపిస్తుంది. దాని చుట్టూ ఎడవైపు మెనూ బటన్‌ టైమర్‌ బటన్‌ ఉంటాయి.

కుడివైపు స్టార్ట్‌, స్టాప్‌ వార్మ్‌ అనే ఆప్షన్స్‌ బటన్స్‌ ఉంటాయి. టైమ్‌ సెట్‌ చేసుకోవడంతోపాటు డిస్‌ప్లే ఆప్షన్స్‌ మార్చుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన బటన్స్‌ ఉంటాయి.

కుకింగ్‌ టైమ్‌, స్టీమర్‌, క్రిస్పీ, బేకింగ్‌ అనే ఆప్షన్స్‌ డిస్‌ప్లేలో మార్చుకో వచ్చు. దాంతో చ ఆలారకాలు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు.

ఈ మల్టీ కుకర్‌ని శుభ్రం చేసుకోవడం కూడా చాలా సులభం. దీన్ని ఇతర ప్రదేశాలకు తీసుకుని వెళ్లేందుకు వీలుగా హ్యాండిల్‌ కూడా ఉంటుంది.

ఈ మోడల్‌ కుక్కర్స్‌ రెడ్‌, బ్లాక్‌, వైట్‌, పింక్‌ వంటి కలర్స్‌లో కూడా లభిస్తున్నాయి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/