ఆనంద జీవనం సొంతం కావాలంటే.
వృత్తికి వ్యక్తిగత జీవితానికి మధ్య సన్నని రేఖ ఉంటుంది. జీవిత రేఖ. దాన్ని దాటితే లక్ష్మణ రేఖను మీరినట్లే. జీవితం అతలాకుతలమవుతుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని విషయాలు మనసుకు పట్టించుకోవాలి. మరికొన్ని వదిలించుకోవాలి. సక్సెస్‌ఫుల్ కెరీర్‌తో పాటు ఆరోగ్యవంతమైన ప్రశాంత జీవనం సొంతం చేసుకోవాలంటే ఉరుకుల పరుగుల జీవితానికి ఒక్క క్షణం స్వస్తి చెప్పి జీవిత గమనాన్ని గమనించుకోవాలి.

చాలా మంది ఆఫీసు సమయం అయిపోయాక కూడా పని చేస్తుంటారు. మరికొంత మంది సెలవుల్లో ఇంటి దగ్గరున్నా ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్లతో పనిచేస్తుంటారు. ఆఫీసు పని, వ్యక్తిగత జీవితం రెంటి మధ్య సమతూకం లేకపోతే ఆరోగ్యం, కెరీర్ రెండూ దిబ్బతింటాయని అధ్యయనాలు చెపుతున్నాయి. చేయాల్సిన పనుల్లోంచి అతి ముఖ్యమైన వాటిని ఎంచుకోవాలి. వాటిని ఒకటి, రెండు, మూడు ఇలా వరుస క్రమంలో చేసుకుంటూ పోవాలి.
మనసు వేటిని ముఖ్యమైన పనులుగా భావిస్తుందో వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. మొదట రోజువారి జీవితంలో ఎక్కడ సమయం వృధా అవుతుందో గుర్తించాలి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఏం చేయాలో ఆలోచించి ప్రణాళిక వేసుకోవాలి. ఒకే సమయంలో రెండు మూడు పనులు చెక్కబెట్టాలనుకోవద్దు. దాని వల్ల బిజీ కావటమే తప్ప మంచి ఫలితాలు రావు. పనిలో నాణ్యత దెబ్బ తింటుంది.
ఎప్పుడూ పీకల్లోతు పనుల్లో మునిగిపోవద్దు. జీవితంలో మనకంటూ కొంత సమయాన్ని మిగుల్చుకోవాలి. ఎంత అత్యవసర పరిస్థితులున్నా సమయం మన ఆనందం కోసమేనని గుర్తించాలి. అదేపనిగా తలకు మించిన పని మీదేసుకోవద్దు. స్కూల్లో పండుగలకు సెలవులిచ్చినట్లే ఆఫీసు పనికి సెలవు ఇవ్వాలి.

బ్యాగూ, సూట్‌కేస్ సర్దుకుని ఎంచక్కా నచ్చిన ప్రదేశానికి వెళ్లాలి. అలా చేస్తే లైఫ్ బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. అవసరమనుకుంటే ఒక మెంటార్‌ను ఏర్పాటు చేసుకోవాలి. పనిని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడానికి వారి అనుభవం అక్కరకు వస్తుంది. రోజు ఒక గంట వ్యాయామానికి కేటాయిస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో రోజూ కొంత సేపు గడపాలి.
ఆ సమయంలో మరే పని గురించి ఆలోచించవద్దు. సెల్‌ఫోన్ కూడా స్విచాఫ్ చేయాలి.
సస్సాంగత్యం మనలో మంచి మార్పునకు నాంది పలుకుతుంది. దీనివల్ల ఆలోచనా విధానం మారుతుంది. ప్రకృతిని తరచూ ఆస్వాదించాలి. అది మనలో ఆత్మవిశ్వాసంతో పాటు పాజిటివ్‌నెస్‌ఉ పెంచుతుంది.
దైనందిన జీవితంలో రోజుకు ఒకట్రెండుసార్లు ఓ పది నిమిషాలపాటు ప్రశాంతంగా ఆలోచించాలి.
ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఎలా వ్యవహరించాలో నిర్ణయం తీసుకోవాలి. కష్టాలు వస్తే కుంగిపోవద్దు. కష్టమెప్పుడు శాశ్వతం కాదు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/