కురుల సింగారాలు

అందమే ఆనందం

Beautiful Hair

జుట్టు రాలడానికి ప్రధానంగా శరీరతత్వం, అనారోగ్యం, ఆపరేషన్లు, విటమిన్ల లోపం, థైరాయిడ్‌ సమస్యలు, హార్మోన్ల అసమానత, మందుల సైడ్‌ఎఫెక్ట్స్‌ కారణాలుగా ఉంటాయి.

పురుషుల్లో జుట్టురాలడం సాధారణంగా పురుషుల్లో ఈ సమస్య వంశానుగతంగా వస్తుంది. ఒక వయసు దాటాక పురుషుల్లో స్త్రీల కంటే ఎక్కువగా వెంట్రుకలు రాలిపోతుంటాయి.

కుటుంబంలో ఎవరికైనా బట్టతల ఉంటే అది పురుషులకు వస్తుంది. ఇలాంటి వారికి జుట్టు ఎక్కువగా రాలుతుంది. దీన్ని ‘మ్యాన్‌ ప్యాటర్నల్‌ బాల్డ్‌నెస్‌అంటారు.

పురుషుల్లో ‘ఆండ్రోజన్‌ హార్మోన్‌ ఎక్కువైనా జుట్టు రాలిపోతుంది. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. ఇలా రాలిన జుట్టు తిరిగి రావడం కష్టం.

తరచుగా చుండ్రు, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వస్తూ ఉంటే జుట్టు వేగంగా రాలిపోతుంది. ఫలితంగా బట్టతల వచ్చేస్తుంది.

స్త్రీలలో జుట్టు రాలటం:

స్త్రీలలో ప్రధానంగా పోషకాహార లోపం కారణంగా జుట్టు రాలిపోతుంది. అవసరానికి మించి స్టయిలింగ్‌ చేయడం, హెయిర్‌ ట్రీట్‌మెంట్లు, తీసుకోవడంతో జుట్టుపై ఒత్తిడి పెరుగుతుంది.

విటమిన్ల లోపం, రక్తహీనత కూడా జుట్టును బలహీనపరుస్తుంది.

శిరోజాలపై ఎక్కువగా రసాయనాలు వాడడం. స్టయిలింగ్‌లో భాగంగా నుదుటి భాగంలో కొంతమేరకు కుదుళ్లను తొలగించడం లాంటివి జుట్టురాలడానికి కారణమవుతాయి.

ప్రసవం తర్వాత హార్మోన్ల ప్రభావంతోనూ జుట్టుఎక్కువగా రాలిపోతుంది.

పిల్లల్లో ఈ సమస్య ఏర్పడటానికి జుట్టును శుభ్రంగా ఉంచకపోవడం, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు, వంశంలో పెద్దవారికి బట్టతల ఉంచడం, రకరకాల స్టయిల్స్‌తో జుట్టుపై ఒత్తిడి పెంచడం, సర్జరీలు, కీమోథెరపీ లాంటివి కారణాలుగా ఉంటాయి.

‘టీనియాకైపిటస్‌ అనే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌తో పిల్లల్లో ఎక్కువగా జుట్టు రాలుతుంటుంది.

ఈరోజుల్లో జుట్టురాలడం ఒక సాధారణ సమస్య. కొన్ని జాగ్రత్తలతో దీన్నుంచి బయటపడవచ్చు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్లు ఎక్కువగా అవసరం.

ఆహారంలో ప్రొటీన్లు తక్కువైతే జుట్టు నిర్జీవంగా మారిపోతుంది. జుట్టుకు ఫర్మింగ్‌, కలరింగ్‌, స్టయిలింగ్‌ తగ్గించాలి. మాటిమాటికీ షాంపూలను మార్చకూడదు.

తరచుగా మాయిశ్చరైజర్‌ జుట్టుకు వాడాలి. గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్‌ చేయాలి.

తలస్నానం తర్వాత జుట్టుకు సీరం, కండీషనర్‌ తప్పక వాడాలి. నూనెతో మసాజ్‌ చేస్తే శిరోజాలకు నిగారింపు వస్తుంది.

ఆహారంలో పాలు, పండ్లు, పచ్చికూరగాయలు, చేపలు తీసుకోవాలి. నీళ్ల ఎక్కువగా తాగాలి. ఏదైనా ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టరుకు చూపించాలి. జుట్టుపై ఒత్తిడి పెరిగిన కారణంగా త్వరగా ఊడిపోతుంది.

నేటితరం అమ్మాయిలు హీరోయిన్లను అనుకరిస్తూ జీరోసైజ్‌ కోసం డైటింగ్‌ చేస్తున్నారు.
డాక్టర్‌ పర్యవేక్షణ లేకపోతే సైజు తగ్గడం మాటేమోగానీ, జుట్టుకు మాత్రం హాని జరుగుతుంది.

సాధారణంగా జుట్టుకు ఫర్మింగ్‌, స్రైటింగ్‌, కలరింగ్‌ చేయించిన తర్వాత నెలరోజులకు 10శాతం వెంట్రుకల రాలిపోతాయి. ట్రీట్‌మెంట్లు తగ్గించాలి. ట్రీట్‌మెంట్‌కు ముందు హెయిర్‌ ప్రొటెక్షన్‌ సీరమ్‌ కొన్నాళ్లు వాడాలి.

హెయిర్‌ డ్రయ్యర్‌ను మరీ దగ్గరగా ఉంచి వాడితే జుట్టురాలే ప్రమాదం ఉంది. డ్రయ్యర్‌ను 10 అంగుళాల దూరంగా ఉంచి వాడాలి.


తలవెంట్రుకలు ఎక్కువగా రాలిపోతున్నప్పుడు ‘బి కాంప్లెక్స్‌ ఐరన్‌ టాబ్లెట్స్‌ యాక్స్‌సాల్‌ క్యాప్సూల్స్‌ ప్రతిరోజూ ఒకటి చొప్పున వేసుకోవాలి.

తలకి స్నానంచేసేటపుడు వొంటిసబ్బులు వాడకండి. గోరింటాకులో నిమ్మరసం, కోడిగుడ్డు సొన కలిపి తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రుపోవటమే కాదు జుట్టుపట్టులా మెత్తగా ఉంటుంది.

మందారపూలు ఎండబెట్టి కొబ్బరినూనెలో వేసి కాచి వడగట్టిన తర్వాత రాసుకుంటే తల వెంట్రుకల ఎదుగుదలకు, జుట్టు రాలకుండా ఉండేందుకు అద్భుతంగా పనిచేస్తుంది.

నగర వాతావరణానికి పేలవంగా, రఫ్‌గానూ తయారవుతుంది. తేలికపాటి షాంపూలు కొద్దిగా మాత్రమే ఉపయోగించాలి.

కఠినమైన షాంపూలు శిరోజాల్లోని సహజమైన నూనెల్ని హరించి వేస్తాయి.

అలాగే బాగా వేడి నీటిని తలపై పోసుకోకూడదు. షాంపూ చేసుకున్న తర్వాత కండీషనర్‌ అప్లయి చేయాలి. లేదా కండీషనర్‌ కలిసి ఉన్న షాంపూను ఎంచుకోవాలి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/