కింగ్‌కోఠి ఆసుపత్రిలో విషాదం: ముగ్గురు కరోనా రోగులు మృతి

ఆక్సిజన్ సమయానికి అందక పోవటమే కారణం

covid deaths
covid deaths

Hyderabad: కింగ్‌కోఠి ఆస్పత్రిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్ సమయానికి అందక ముగ్గురు కరోనా రోగులు మృతి చెందారు.జడ్చర్ల నుంచి ఆస్పత్రికి రావాల్సిన ట్యాంకర్ ఆలస్యమైంది. ట్యాంకర్ డ్రైవర్ రూటు మర్చిపోవడంతో సమస్య తలెత్తింది. ఈలోగా ఆక్సిజన్ అందక ఆసుపత్రిలోని ముగ్గురు కరోనా రోగులు మృతి చెందారు. మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/