పుట్ట శైలజకు పోలీసు నోటీసులు

వామన్‌రావు న్యాయవాద దంపతుల హత్య కేసు దర్యాప్తు

పుట్ట శైలజకు పోలీసు నోటీసులు
Putta Madhu- Sailaja

Hyderabad: వామన్‌రావు న్యాయవాద దంపతుల హత్య కేసులో పుట్ట శైలజకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ మేరకు కమిషనరేట్‌లో పుట్ట శైలజను విచారణ జరిపారు. ఈ కేసులో పుట్ట మధు దంపతుల పాత్ర ఉందని ఐజీకి వామన్‌రావు తండ్రి కిషన్ రావు ఫిర్యాదు చేశారు. కొడుకు, కోడలు హత్యపై మరిన్ని వివరాలు అందించనున్నారు. ఆదివారం కమిషనరేట్ కార్యాలయం నుంచి కిషన్ రావుకి ఫోన్ రావడంతో ఆయన రామగుండం కమిషనరేట్ కార్యాలయానికి వచ్చారు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/