మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా పాజిటివ్

హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడి

TS Minister koppula eshwar
TS Minister koppula eshwar

Hyderabad: తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా నిర్థారణ అయింది. అస్వస్థతగా ఉండడంతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు.ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని.. వైద్యుల సహాయ మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు మంత్రి తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించాలని, పరీక్షలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోరారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/