రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం పోరాడండి

Kesineni Nani
Kesineni Nani

అమరావతి: టిడిపి ఎంపి కేశినేని నాని సిఎం జగన్‌, వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలపై మండిపడ్డారు. న్యాయవ్యవస్థ తీరును తప్పుపడుతూ పార్లమెంటు ప్రాంగణంలో నిన్న వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అమరావతి కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని స్పందిస్తూ.. ఏ అంశం మీదనైనా సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే దానికి కేంద్రం ఆమెదం తెలపడం ఆనవాయతీ అని చెప్పారు. దానికి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. జగన్ గారూ రాష్ట్రానికి రావాల్సిన వాటికోసం మీ ఎంపిలు పోరాడితే ప్రజలు హర్షిస్తారని చెప్పారు. చెత్త రాజకీయాలు మాని రాష్ట్రానికి రావాల్సి వాటిపైన పోరాటం చేయాలని కేశినేని హితవు పలికారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/