ట్రంప్‌పై మాజీ మోడల్‌ సంచలన ఆరోపణలు

కుటుంబ భద్రత కోసమే ఇన్నాళ్లూ ఈ విషయాన్ని బయటపెట్టలేదు

Former model accuses Donald Trump of sexually assaulting her in 1997
1997 లో ట్రంప్ లైంగికంగా వేధించాడు : మాజీ మోడల్

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఓ మాజీ మోడల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తనను పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని మాజీ మోడల్ అమీ డోరిస్ (48) ఆరోపించారు. న్యూయార్క్‌లో జరిగిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ జరుగుతుండగా ట్రంప్ తన వీఐపీ సూట్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మాజీ మోడల్ అమీ డోరిస్ చెప్పారు. తనతో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు తనను గట్టిగా లాగి ముద్దు పెట్టుకున్నారని, తన శరీరాన్ని అనుచితంగా తాకారని డోరిస్ పేర్కొన్నారు.

ఈ విషయాన్ని వెల్లడించాలని 2016లోనే తాను భావించానని, అయితే, కుటుంబ భద్రత, పిల్లల కోసం ఇన్నాళ్లు మౌనంగా ఉండాల్సి వచ్చిందన్నారు. తన టీనేజీ కవల కుమార్తెలకు రోల్ మోడల్‌గా నిలవాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడీ విషయాన్ని బయటపెట్టినట్టు డోరిస్ పేర్కొన్నారు. ఆమె ఆరోపణలపై ట్రంప్ న్యాయవాదులు స్పందించారు. డోరిస్ ఆరోపణల్లో వాస్తవం లేదని, రాజకీయ దురుద్దేశంతోనే వీటిని చేస్తున్నారని కొట్టిపడేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/