సిఎం స్టాలిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్‌

kcr-wishes-to-tamil-nadu-cm-stalin-on-his-birthday

హైదరాబాద్‌ః నేడు తమిళనాడు సీఎం స్టాలిన్‌ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన సిఎం కెసిఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం స్టాలిన్ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సిఎం కెసిఆర్‌ ఆకాంక్షించారు. ఎంకే స్టాలిన్‌ బుధవారం (మార్చి 1న) ఆయన 70 పడిలోకి అడుగుపెట్టారు. తన జన్మదినం సందర్భంగా మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 55 ఏళ్ల జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశానని, పిన్న వయస్సులోనే రాజకీయ ప్రవేశం చేశానని పేర్కొన్నారు. ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి తీరుతానని పేర్కొన్నారు.