సుధీర్ బాబు కొత్త అవతారం..చూస్తే షాక్ అవ్వాల్సిందే

సుధీర్ బాబు కొత్త అవతారంలో కనిపించి షాక్ ఇచ్చాడు. మొన్నటి వరకు సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించిన సుధీర్..ఇప్పుడు భారీ లావుగా కనిపించి అందర్నీ షాక్ లో పడేసాడు. ఈ మధ్యనే ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సుధీర్..ఇప్పుడు “మామ మశ్చీంద్ర” అనే సినిమాతో రాబోతున్నాడు. హర్ష వర్ధన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో సుధీర్ చాల లావుగా కనిపించబోతున్నాడు. ఈయనకు సంబదించిన ఫస్ట్ లుక్ ను బుధువారం చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సుధీర్ ను చూసిన వారంతా అప్పుడెప్పుడో అల్లరి నరేష్ నటించిన లడ్డుబాబు చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రవిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ లో కూడా నరేష్ బాగా లావుగా , పొట్ట తో కనిపించాడు. ఇప్పుడు సుధీర్ కూడా అలాగే కనిపిస్తున్నాడు.

ఈ సినిమాలో సుధీర్ బాబు మల్టీ షేడెడ్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు. ఇందులో భాగంగా దుర్గా అనే పాత్ర కోసం ఈ విధంగా తన రూపాన్ని మార్చుకున్నారు. సుధీర్ బాబు లావుగా ఉండటమే కాకుండా డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అంతా విలక్షణంగా ఉంది. జీపుపై కూర్చున్న ఈ హీరో నోట్లో బంగారు గొలుసుతో ఎవరినో తీక్షణంగా చూస్తున్నట్టు కనిపించారు. పొడవాటి జుట్టు, తేలికపాటి గడ్డంతో దర్శనం ఇచ్చాడు.

సుధీర్ బాబు కెరీర్లో 15వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో ఆయన మూడు ఛాలెంజింగ్ పాత్రలు పోషించచారు. ఇక ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తుండగా పీజీ విందా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమాను నారాయణ దాస్ నారంగ్ పుస్కర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.