విష్ణు మూర్తి అవతారంలో యంగ్ రెబెల్ స్టార్..?

బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వస్తున్న ప్రభాస్..ప్రస్తుతం సెట్స్ ఫై సలార్, ప్రాజెక్ట్ కే, మారుతీ డైరెక్షన్లో రాజా డీలక్స్ మూవీస్ చేస్తున్నాడు. వీటిలో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేస్తున్న ప్రాజెక్ట్ కే చాల ప్రత్యేకమైంది. ఈ సినిమా తాలూకా పలు విశేషాలు బయటకొస్తూ సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి. మొన్నటి వరకు ఈ చిత్రం ఒకటే పార్ట్ గా రాబోతుందని అనుకున్నారు. కానీ రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నట్లు వినికిడి.

తాజాగా నిర్మాత అశ్విన్ దత్ మాట్లాడుతూ.. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఆధునిక విష్ణుమూర్తికి సంబంధించి ఉంటుందని చెప్పుకొచ్చారు. సినిమాలో భారీగా గ్రాఫిక్స్, ఎమోషన్లు, సెంటిమెంట్ కూడా బలంగా ఉంటాయని ఆయన అన్నారు. దీంతో ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రభాస్, విష్ణు అవతారంలో కనిపిస్తాడేమో అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ మూవీ లో రాముడి పాత్రలో కనిపిస్తున్నాడు. మరి నిజంగా ప్రభాస్ విష్ణు అవతారంలో కనిపిస్తాడా..? అనేది చూడాలి.