స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన కవిత

కవిత డ్రైవర్‌కు కరోనా నిర్ధారణ

స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన కవిత
kavitha

హైదరాబాద్‌: తెలంగాణ కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం మొహమ్మద్ అలీ సహా పలువురు ఎమ్మెల్యేలు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా నిజామాబాద్ మాజీ ఎంపీ, సిఎం కెసిఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఆమె డ్రైవర్‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు ఆమె స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు కవిత సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో 50 వేల మార్కును దాటేసింది. అలాగే, ఇప్పటి వరకు 447 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇంకా 11,052 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/