తెలంగాణలో కొత్తగా 1,567 కేసులు నమోదు

మరో 9 మంది మృత్యువాత

corona virus-telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. నిన్న కొత్తగా 1,567 పాజిటివ్ కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50 వేల మార్కును అధిగమించింది. ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50,826కి చేరింది. తాజాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 662, రంగారెడ్డి జిల్లాలో 213 కేసులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో 9 మంది మరణించగా, కరోనా మృతుల సంఖ్య 447కి పెరిగింది. నిన్న 1,661 మందిని డిశ్చార్జి చేశారు. మరో 11,052 మంది చికిత్స పొందుతున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/