ప్రధానితో ముగిసిన కేసీఆర్ భేటీ..16 అంశాలపై సుదీర్ఘ చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. దిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు మోడీతో కేసీఆర్ సమావేశం సాగింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు, కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులపై కేంద్రం విడుదల చేసిన గెజిట్​పై ప్రధానితో చర్చించినట్లు సమాచారం.

అలాగే ఐపీఎస్ క్యాడర్ రివ్యూజౌళి పార్క్ ఏర్పాటు, హైదరాబాద్-నాగ్‌పుర్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు, పీఎంజీఎస్‌వైకు అదనపు నిధులు కేటాయించాలని వినతి , మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలని , కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు తో పాటు గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఫై మోడీతో కేసీఆర్ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.

ఇక కేసీఆర్ ఢిల్లీ పర్యటన విషయానికి వస్తే..ఈ నెల 1న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్​.. నిన్న.. వసంత విహార్​ సమీపంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈరోజు మోడీ తో సమావేశమయ్యారు. అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లనూ.. కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. వీరిద్దరినీ కలిశాకే ముఖ్యమంత్రి.. హైదరాబాద్​ వస్తారని సమాచారం.