ఈర్ష్య: సాయినాథుని లీలలు

ఆధ్యాత్మిక చింతన

Shirdi Sai Baba
Shirdi Sai Baba

ఏదైనా ఒక వ్యక్తికి పేరు ప్రతిష్టలు రాకపూర్వం అతడిని పిచ్చివాడని రాళ్లతో పిల్లలు కొడతారు. సాయిబాబా జీవితంలో ఇది జరిగింది. రమణమహర్షి జీవితంలో కూడా ఇది జరిగింది.

ఇక ఆ వ్యక్తి మహనీయునిగా ప్రజలు భావించే సమయం వచ్చినప్పుడు, ఇంద్రుడు చంద్రుడు అంటూ నీరాజనాలు ఇస్తారు. అయితే కొందరు ఆ వ్యక్తిని అలా గౌరవించడం ఇష్టపడరు.

వీలయినంత కసిని, అక్కసును మనసులో పెంచుకుంటారు. ఇతరులను కూడా ఆ మహనీయునిపై ద్వేషాన్ని రగిలిస్తారు. సిద్ధారూఢులను విషాహారం ఇచ్చి చంపారు గిట్టనివారు.

దయానందసరస్వతికి కూడా గాజుపొడిని పాలల్లో కలిపి ఇచ్చారు. మహమ్మదీయ మతంలో సర్మద్‌ను శిరచ్ఛేదం చేశారు. క్రీస్తమతంలో జీసస్‌ను శిలువ వేశారు.

ఆ మహనీయులందరూ తమ విరోధులు తమపై కుట్ర పన్నుతున్నారని తెలిసి కూడా పట్టించుకోరు.

అంతకంటే విచిత్రంగా వారు చేసిన ఆ అపరాధాన్ని క్షమింపుమని దైవాన్ని కోరతారు. పల్టు నంగాజలాల్‌పూర్‌లో పుట్టాడు.

చిన్నప్పటి నుండి ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపేవాడు. ఆయన కుటుంబానికి గోవిందమహారాజ్‌ అనే వ్యక్తి కుల పురోహితుడు.

గోవింద మహారాజ్‌కు కూడా ఆధ్యాత్మికత వైపు దృష్టిని పెట్టేవాడు. ఆ ఇద్దరూ పల్టు, గోవింద ఎవరైనా ఒక మార్గదర్శి దొరుకుతారా అని అన్వేషించసాగారు. పల్టు అయోధ్యలోనే ఉండిపోయాడు. గోవింద అనేక ప్రదేశాలను వెళ్లాడు.

గోవిందకు భిఖాసాహెబ్‌ దర్శనమయింది. ఇక భిఖాసాహెబ్‌ను గురువుగా ఎన్నుకుని, ఆయన నుండి ఆధ్యాత్మిక సంపదను పొందాడు.

గోవింద్‌ అయోధ్యలో నున్న పల్టు వద్దకు వచ్చి, సంగతి చెప్పాడు. ఇక పల్టుకు గోవింద్‌ గురువు అయ్యాడు.

పల్టు ఆధ్యాత్మిక విద్యను గోవింద్‌ వద్ద నేర్చుకున్నాడు. వినయవిధేయలతో. ‘అమృత సాగరాన్ని చూస్తే చాలదు.

దాని దగ్గరకు పోయి అమృతాన్ని తాగాలి, కల్పతరువును చూస్తే చాలదు, దానిని కోరుకోవాలి అనేవాడు పల్టు మహారాజ్‌. ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువును ఎన్నుకొనగానే చాలదు.

ఆ గురువ్ఞ శిష్యున్ని యజమాని కుక్కను చీదరించుకున్నట్లు, కసిరినా, తలుపులు మూసినా ఏమీ పటించుకొనకూడదు. ఆ గురువునే అంటిపెట్టుకుని ఉండాలి.

పల్టు మహారాజ్‌ అయ్యాడు. అయోధ్య పరిసర అడవులలో ఉండేవాడు. ఆయన వాక్కులు ఉత్తర హిందూ స్థానమంతా తెలియనారంభించాయి.

అడవిలోకే రాజులు, సామంతులు, సామాన్యులు పోయి ఆ పల్టును దర్శించారు. ఆయన నివసించేది ఒక చిన్న గుడిసెలో, కొందరు సన్యాసులు ఆయనకు కీర్తి రావటం ఇష్టంలేక ఒక అర్ధరాత్రి ఆయన పరుండే గుడిసెకు నిప్పటించారు.

ఆయన భస్మమయ్యారు. అదే సమయంలో ఆయన పూరీజగన్నాధ్‌ను దర్శిస్తున్న శిష్యులకు కనిపించారు. ఒక డోహా (పద్యం)లో ‘అయోధ్యలో నన్ను మసి చేశారు. జగన్నాధుని ఒడిలో సేద తీర్చుకున్నాను అని పల్టు రాశారు.

అంతేకాని తన మరణకారకులను నిందించలేదు.పండిన చెట్టుపైకి రాళ్లు విసురుతుంది ఈ లోకం అనేది జగమెరిగిన సత్యం. దెబ్బగు గురైన వారే సంతులు (సాధు సత్పురుషులు).

-యం.పి.సాయినాథ్‌

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/